భారతదేశం, సెప్టెంబర్ 24 -- బుధ గ్రహం విద్య, తెలివితేటలు, తార్కిక ఆలోచన, వ్యాపారం, లావాదేవీలు, సంభాషణ నైపుణ్యాలతో ముడిపడి ఉంటుందని భావిస్తారు. అందువల్ల బుధ గ్రహం మారడం లేదా నక్షత్ర మారడం అనేది 12 రాశుల వారి జీవితంలోని వివిధ రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తా నక్షత్రంలో ఉన్న బుధుడు అక్టోబర్ 1న స్వాతి నక్షత్రంలోకి వెళ్తాడు. అక్టోబర్ 1, గురువారం ఉదయం 9:33 గంటలకు స్వాతి రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 12 వరకు ఉంటాడు. స్వాతి నక్షత్రంలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది.

మేష రాశి వారికి స్వాతి నక్షత్రంలో బుధ సంచారం వృత్తి, ఆర్థిక విషయాలలో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. పని ప్రదేశంలో మీ సంభాషణ నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం గుర్తించవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో వృత్తిపరమైన అభ...