భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పాత కలెక్టర్లు కూడా పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే.. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పాలసీ ఇవ్వడం కాదు.. అమలు చేయడం కూడా ముఖ్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాల రూపు రేఖలు మార్చే ఛాన్స్ కలెక్టర్లకు ఉందని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం స్మార్ట్ వర్క్ చేస్తేనే మంచిదన్నారు. భారత్‌ను మెుదటిస్థానంలో నిలపాలని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం.. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంద...