భారతదేశం, జూలై 5 -- మనందరం స్వర్గం గురించి విని ఉంటాం. అక్కడ దేవతలు, అప్సరసలు ఉంటారని, దుఃఖాలు గానీ ఉండవని మనం నమ్ముతాం. మనం మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే హిందూ పురాణాల ప్రకారం, స్వర్గం మానవుని అంతిమ గమ్యం కాదు. వాస్తవానికి స్వర్గం కేవలం తాత్కాలికమైనది. మీ పుణ్యం పూర్తయిన వెంటనే.. మీరు భూమికి తిరిగి రావాలి. పురాణాలలో చెప్పిన చతుర్దశ భువనం.. అదే 14 లోకాల్లో చాలా విషయాలు ఉంటాయి.

హిందూ మతం ప్రకారం విశ్వంలో మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం నివసించే భూలోకాన్ని కేంద్రంగా చేసుకుని, భూమి కింద 7 లోకాలు (అధో లోకాలు), భూమి పైన 7 లోకాలు (ఊర్ధ్వ లోకాలు) ఉన్నాయి.

చాలా మంది భూమికి దిగువన ఉన్న లోకాలు నరకం అని పొరబడతారు. కానీ నరకం వేరు, ఈ దిగువ లోకాలు వేరు. పురాణాల ప్రకారం భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలను 'బిలవర్గం' అని పి...