భారతదేశం, జూలై 21 -- తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టీజేఎఫ్) 25 ఎండ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ కలయిక జరిగింది. వ్యవస్థాపకులతో సహా 2001 నుంచి నేటి వరకు టీజేఎఫ్ వేదికగా పనిచేసిన జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలు మీడియా ఛానల్స్, పత్రికల్లో పనిచేస్తూనే నాటి ఆంధ్రా యాజమాన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం పనిచేసిన తీరు గురించి, వారి అనుభవాలను ఈ సందర్భంగా జర్నలిస్టులు పంచుకున్నారు.

తెలంగాణలోని పత్రికల్లో ఛానెల్‌లలో తెలంగాణ ఎడిటర్లే ఉండాలనీ, తెలంగాణ విడిపోయాక కూడా తెలంగాణ జర్నలిస్ట్ లపట్ల వివక్ష కొనసాగుతుందనీ పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. త...