భారతదేశం, జూలై 18 -- తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక కార్పొరేషన్ (TSCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 'ఆర్థిక సహాయ పథకం' కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు.

ఈ పథకం కింద విభిన్న ఉపాధి రంగాలకు సంబంధించిన యూనిట్లను ప్రభుత్వం కేటాయించనుంది. కుట్టు మిషన్లు , చిన్న తరహా వ్యాపారాల నిర్వహణకు ఒక విభాగంగా... అలాగే ఈ-బైక్ (E-Bike), ఈ-స్కూటీ , మోటార్ బైక్ యూనిట్లను మరొక విభాగంగా నిర్ధారించారు. దరఖాస్తుదారుల వయస్సు, విద్యార్హతలను బట్టి ఈ యూనిట్లను మంజూరు చేస్తారు.

అర్హత కలిగిన క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జ...