భారతదేశం, జనవరి 26 -- మనము నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని కలలు అసలు మనకు గుర్తు ఉండవు. కొన్ని కలలు వచ్చినట్లయితే, అవి శుభ ఫలితంగా భావించాలి. బ్రహ్మ ముహూర్తంలో ఈ కలలు వస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందని అంటారు.

బ్రహ్మ ముహూర్తం సమయంలో కొన్ని కలలు వస్తే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన కలలు నెరవేరుతాయని అంటారు.

బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వచ్చినట్లయితే మంచి జరగబోతోందని, అదృష్టం కలిసి రాబోతోందని, అనేక మార్పులు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని అర్థం చేసుకోవాలి. తెల్లవారుజామున ఈ వస్తువులు కలలో కనపడితే మాత్రం కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తంలో ధాన్యం కుప...