భారతదేశం, జూన్ 22 -- గ్లోబల్ స్పేస్ టెక్నాలజీ దిగ్గజం 'స్పేస్ఎక్స్' (SpaceX) అంతర్జాతీయ విభాగంతో వ్యాపార అవకాశాల పరిశీలన వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ (Blue Cloud Softech Solutions) షేర్లు సోమవారం ఉదయం రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలో భాగస్వామ్యం కోసం ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ఈ స్టాక్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 21.67 గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

ఉదయం 11:07 గంటల సమయంలో బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ షేరు ధర 17.00 శాతం లాభంతో రూ. 21.13 వద్ద ట్రేడవుతోంది.

షేరు ధర పెరగడంతో పాటు ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా ఊహించని స్థాయిలో నమోదయ్యాయి. బీఎస్‌...