భారతదేశం, సెప్టెంబర్ 9 -- శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు సెప్టెంబర్ 6వ తేదీన చోటుచేసుకున్న సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా శాసనసభలో వెల్లడించారు

శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్‌ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతంపై శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్రవల్లిలో దళితులు నడిచారని రోడ్డును శుద్ధి చేసినట్టుగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అసెంబ్లీ అండగా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాలపై శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై ముఖ్యమంత్రి మాట్లాడా...