Telangana,hyderabad, ఆగస్టు 8 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీనే కాదు బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, కుల సంఘాలు కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే దిశగా అడుగులు వేశామని కాంగ్రెస్ చెబుతుండగా.. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై క్లారిటీ లేకపోవటంతో. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా ముందుకు సాగటం లేదు. చాలా రోజులుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మరోవైపు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈసీ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుం...