Telangana,hyderabad, అక్టోబర్ 5 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. మొత్తం 3 విడుతల్లో ఎన్నికలను పూర్తి చేస్తామని ఈసీ వెల్లడించింది. అక్టోబర్‌ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభం కాగా.. నవంబర్‌ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది.

అ‍క్టోబర్‌ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషేన్‌ విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్‌ 11వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. ఈ ప్రక్రియకు సమయం కూడా దగ్గరపడింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, సందేహాల నివృత్తి, ఎన్నికల సంబంధిత సమాచారాన్...