భారతదేశం, అక్టోబర్ 2 -- తెలంగాణలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు మెుదలుకానున్నాయి. అయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం తెలిపింది. పరిమితికి మించి వ్యయం చేసినా.., 45 రోజుల్లోపు ఖర్చుల వివరాలను సమర్పించకపోయినా ఈసీ చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించకపోతే మూడేళ్లపాటు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారు. ఒకవేళ గెలిచినా.. పదవిని కోల్పోయే అవకాశం ఉంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 238 కింద పలు నిబంధనలు ఉన్నాయి.

5000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడుగా పోటీ చేసే వ్యక్తి రూ.50 వేలలోపు ఖర్చు చేయాలి. ఒకవేళ 5000 కంటే తక్కువ జనాభా ఉంటే సర్పంచి అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడిగా పోట...