Telangana, సెప్టెంబర్ 28 -- రాష్ట్రంలోని జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు శనివారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో బీసీలకు 13 కేటాయించారు. ఎస్సీలకు 6, ఎస్టీలకు 4 స్థానాలు ఖరారు కాగా.. మిగిలిన 8 స్థానాలను జనరల్‌ కేటగిరిగా పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో 13 స్థానాలకు బీసీలకు అంటే.. 42 శాతం రిజర్వేషన్లతో ఈ జాబితాను రూపొందించారు.అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం చైర్‌పర్సన్‌ పదవుల రిజర్వేషన్లకు సంబంధించిన లాటరీ కూడా నిర్వహించారు. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి.

31 జిల్లాల్లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ తో పాటు పంచాయతీల్లోని ఆయా స్థానాలకు రిజర్వేషన్లు, జిల్లాల వారీగా గెజిట్ లు పం...