భారతదేశం, డిసెంబర్ 23 -- బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. హైదరాబాద్‌లో సోమవారం (డిసెంబర్ 22) సాయంత్రం జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

ముఖ్యంగా మహిళల శరీర భాగాలను ఉద్దేశించి 'సామాన్లు' అని, పద్ధతిగా లేని వారిని 'దరిద్రపు XXX' అనుకుంటారు అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలను మంచు మనోజ్‌తోపాటు సింగర్ చిన్మయి, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

శివాజీ వ్యాఖ్యలపై హీరో మంచు మనోజ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. "గత రాత్రి నటుడి వ్యాఖ్యలు నిరాశపరిచాయి. మహిళల హక్కులను పరిరక్షించాలి. కానీ, వారి ఛాయిస్‌లను కాదు. మహిళల దుస్తులపై ఆంక్షలు విధించడం లేదా వారిపై నైతిక బాధ్యత మోపడం అనేది చాలా పాతకాలపు ఆలోచన. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని లేఖలో మంచు మనోజ్ రాసుకొచ్చారు.

"గౌ...