భారతదేశం, మే 11 -- తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది నీరాజనాలు అందుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రిగా తన సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆదివారం నాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, సోమవారం నాడు ఒక గొప్ప రాజకీయ సంప్రదాయానికి తెరలేపారు. తన సమీప ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.

రాజకీయాల్లో యుద్ధం కేవలం ఎన్నికల వరకేనని, వ్యక్తిగత గౌరవం అంతకంటే మిన్న అని నిరూపిస్తూ సాగిన ఈ భేటీకి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK), విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) మధ్య అత్యంత హోరాహోరీ పోరు నెలకొంది. ప్రచార పర్వంలో ఒకరిపై ఒకరు...