భారతదేశం, ఫిబ్రవరి 13 -- స్టార్ మా సీరియల్స్ ను అభిమానించే ప్రేక్షకులకు ఆ ఛానెల్ ఓ పండగలాంటి న్యూస్ చెప్పింది. ఈ ఛానెల్లో మంచి ఆదరణ సంపాదిస్తున్న రెండు సీరియల్స్ గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు 30 నిమిషాలు కాకుండా 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతాయని చెప్పడం విశేషం. మరి ఆ మారిన టైమింగ్స్ ఏంటో చూడండి.

స్టార్ మా ఛానెల్ టాప్ 5 సీరియల్స్ లో ఒకటైన గుండె నిండా గుడి గంటలు ఇక నుంచి రోజూ 45 నిమిషాల పాటు రానుంది. సోమవారం అంటే ఫిబ్రవరి 16 నుంచి రోజుకు 30 నిమిషాలు కాకుండా 45 నిమిషాలు వస్తుందని ఆ సీరియల్ టీమ్ ద్వారానే స్టార్ మా వెల్లడించింది.

ఇందులో ప్రధాన పాత్రలైన మీనా, బాలుతోపాటు మనోజ్, రోహిణి, రవి, శృతి, సత్యం, ప్రభావతి ఈ విషయం చెప్పి డ్యాన్సులు వేయడం ఈ వీడియోలో చూడొచ్చు. "మన ఈవెనింగ్స్ ఇప్పుడు మరింత స్పెషల్.. ఈ సోమవారం నుంచి గుండె నిండా గుడి గం...