భారతదేశం, ఏప్రిల్ 22 -- Warren Buffett: స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఒకటే ఆందోళన.. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? వడ్డీ రేట్లు పెరుగుతాయా? జీడీపీ పడిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆర్థిక నిపుణుల (Economists) విశ్లేషణల కోసం ఇన్వెస్టర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అభిప్రాయం దీనికి పూర్తి భిన్నం. స్టాక్ మార్కెట్ గురించి ఎకనమిస్టులు చెప్పే జోస్యాలను నమ్మడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన కుండబద్దలు కొట్టిన పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2016లో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బఫెట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇన్వెస్టర్లకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. "160 ఐక్యూ (IQ) ఉన్న ఎకనమిస్టులు తమ జీవితమంతా మార్కెట్లను అధ్యయనం చేస్తూనే గడుపుతారు. కానీ, సెక్యూరిటీల...