భారతదేశం, నవంబర్ 18 -- న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో తీపికబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్విటీ పెట్టుబడులపై పన్నుల భారాన్ని తగ్గించాలని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. సాధారణ షేర్ల ట్రేడింగ్‌పై విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)ని 50 శాతం మేర తగ్గించే ప్రతిపాదనను అధికారులు సమీక్షిస్తున్నట్లు 'బ్లూమ్‌బెర్గ్' బుధవారం (నవంబర్ 18న) ఒక నివేదికలో వెల్లడించింది.

అదే సమయంలో, స్పెక్యులేటివ్ (జూదం తరహా) ట్రేడింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు డెరివేటివ్స్ (ఫ్యూచర్స్, ఆప్షన్స్) విభాగంపై పన్నులను పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇన్వెస్టర్లను స్వల్పకాలిక ఊహాగానాల ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలిక ఈక్వ...