భారతదేశం, ఆగస్టు 18 -- భారత స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు, అమెరికా సుంకాల సడలింపు, దేశ క్రెడిట్ రేటింగ్ మెరుగుదల వంటి సానుకూల అంశాల నేపథ్యంలో సోమవారం, ఆగస్టు 18న మార్కెట్లు పుంజుకున్నాయి. నిఫ్టీ-50 ఏకంగా 25,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించడం గత నెల రోజుల్లో ఇదే మొదటిసారి. సెన్సెక్స్, నిఫ్టీ-50, నిఫ్టీ బ్యాంక్ సూచీలు ఒక్కరోజులోనే 1% పైగా పెరగడం పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊపు చూస్తుంటే, ఈ దీపావళికి మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పుతాయేమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే, రికార్డులకు చేరాలంటే కొన్ని కీలక అంశాలు కలిసి రావాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన అదనపు సుంకాలను ఉపసంహరించుకుంటే, అది మార్కెట్‌కు పెద్ద ఊరట అవుతుంది. ...