భారతదేశం, ఆగస్టు 9 -- దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలను చూసింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్‌లో పడిపోయాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 233 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 24,363.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 765 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 79,857.79 వద్ద ముగిసింది.

ఆనంద్ రాఠి టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మెహుల్ కొఠారి ప్రకారం, ఈ బలహీనతకు ప్రధాన కారణం ఎఫ్‌ఐఐల అమ్మకాలు, డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్‌లు, ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ తన మునుపటి రేట్లను అలాగే ఉంచడంలాంటి కారణాలు ఉన్నాయి. దీని కారణంగా మార్కెట్ మీద ప్రభావం పడింది.

'గత వారాల్లో, కొన్ని అంశాల ఆధారంగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉంది. ఇండెక్స్ 24,600 మార్కును దాటితేనే తక్షణ పెరుగుదల కనిపిస్తుంది. అందువల్ల ప్రస్తుతానికి ఎటువంటి దూకుడుగా కొనుగోళ్లు చేయకపో...