భారతదేశం, జూన్ 16 -- రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లిన రాజా రఘువంశీని అతని భార్య సోనమ్‌.. ప్రియుడితో ప్లాన్ చేసి చంపించింది. ఈ ఘటన ఇంకా మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన గుల్ఫాషా.. వివాహానికి ఒక రోజు ముందు తన ప్రియుడితో కలిసి వరుడిని హత్య చేసింది.

సోమవారం పోలీసులు వరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వధువు గుల్ఫాషా, ఆమె ప్రేమికుడితో సహా నలుగురిపై హత్య, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రియుడిని, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. వధువు, మరొక నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

రాంపూర్ జిల్లాలోని గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నివాసి నిహాల్(35)కు నాలుగు నెలల క్రితం భోట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల...