భారతదేశం, సెప్టెంబర్ 20 -- రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫారాలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని.. వాటి డిజైన్లలో కొత్తదనంతో పాటు వైవిధ్యం తెచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థులకు అందజేసే పాఠ్య సామగ్రి, యూనిఫాంల పంపిణీ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూళ్లలోని పిల్లలందరికీ ఇప్పటికే ఒక జత యూనిఫా...