సౌదీ విమానాశ్రయంపై దాడిని ఖండించిన భారత్
భారతదేశం, అక్టోబర్ 22 -- పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ అరేబియాలోని పౌర, ఇంధన మౌలిక వసతులపై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడులపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సౌదీలోని దమ్మం నగరం వద్ద ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం సాయంత్రం జరిగిన దాడిలో ఒక భారతీయుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారత్ పూర్తి సంఘీభావం ప్రకటించింది.
అక్టోబర్ 21 బుధవారం సాయంత్రం దమ్మంలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా హౌతీ మూకలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయ పౌరులు ఉన్నారు. ఇదే రోజు తూర్పు ప్రావిన్స్‌లోని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.