భారతదేశం, అక్టోబర్ 25 -- పశ్చిమాసియాలో నెలకొన్న సమస్యలు, భద్రతా కారణాల నేపథ్యంలో సౌదీ అరేబియాలో విమాన సర్వీసులు హఠాత్తుగా రద్దయ్యాయి. దీంతో తెలుగు ఉమ్రా యాత్రికులు అక్కడే చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీఎస్(APNRTS) సంస్థ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మొత్తం 253 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన న్యూ రాయల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో వెళ్లిన 40 మంది యాత్రికుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.

జెడ్డా (కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుంచి ఆదివారం (అక్టోబర్ 25, 2026) రాత్రి 10.50 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో...