భారతదేశం, జూలై 2 -- భావప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, తాము దాన్ని పూర్తిగా గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే స్వేచ్ఛ అంటే అపరిమితమైన హక్కు కాదని, దానికి కూడా కొన్ని చట్టపరమైన హద్దులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించే వారిపై, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆయన సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, విమర్శించే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అద్భుతమైన వేదికలని ఆయన కొనియాడారు. కానీ, ...