భారతదేశం, ఏప్రిల్ 28 -- భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే, ఈ పచ్చని కల వెనుక విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. నిబంధనల ప్రకారం సోలార్ విద్యుత్‌ను తప్పనిసరిగా కొనాల్సిన డిస్కంలు, తీరా వాడుక సమయంలో డిమాండ్ లేకపోవడంతో ఆ విద్యుత్‌ను ఎక్స్ఛేంజీల్లో కారుచౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. సాధారణంగా యూనిట్ రూ. 2 నుంచి రూ. 3.50 వెచ్చించి కొనుగోలు చేస్తుంటే, మార్కెట్లో కేవలం 50 పైసలకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

దేశంలో అతిపెద్ద విద్యుత్ ఎక్స్ఛేంజ్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) గణాంకాల ప్రకారం.. గరిష్టంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే మధ్యాహ్నం వేళల్లో యూనిట్ ధర ఒక్కోసారి రూ. 0.50 పైసలకు పడిపోతోంది. డిస్కం...