భారతదేశం, ఆగస్టు 17 -- మీరు శాంసంగ్ లేదా సోనీ స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే.. మీ బడ్జెట్ రూ .25,000 వరకు ఉంటే మీకోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాం. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే టీవీను సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్, సోనీకి చెందిన ఈ టీవీలు అద్భుతమైన డిస్ ప్లేలతో వస్తున్నాయి. ఈ టీవీల్లో మంచి సౌండ్ కూడా లభిస్తుంది. అమెజాన్ ఇండియాలో అనేక ఆఫర్లతో ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. టీవీలో ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత టీవీ, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

శాంసంగ్ 80 సెంమీ (32 అంగుళాలు) హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ UA32H4550FUXXL. ఈ శాంసంగ్ టీవీ ధర అమెజాన్ ఇండియాలో రూ.11,990. రూ.750 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ తో కేవలం రూ.11,240కే ఈ టీవ...