భారతదేశం, ఆగస్టు 28 -- కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, చైనా చొరబాట్లకు సంబంధించిన కీలక అంశాలను తొలగించాలని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (PRHI) ఒత్తిడి తెచ్చింది. అయితే, తన జీవితకథలో ఎలాంటి మార్పులు లేదా తొలగింపులకు ఒప్పుకునేది లేదని సోనియా తేల్చిచెప్పడంతో ఆ సంస్థతో ఒప్పందం రద్దయింది.

పెంగ్విన్ ఇండియా వెనక్కి తగ్గినప్పటికీ, పెంగ్విన్ అంతర్జాతీయ విభాగమైన 'ఆల్ఫ్రెడ్ ఏ నాఫ్' (Alfred A Knopf) ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిశ్చయించింది. భారత్‌లో ఈ పుస్తక ప్రచురణ, పంపిణీ హక్కుల కోసం హార్పర్ కాలిన్స్ సంస్థ వేగంగా అ...