భారతదేశం, ఆగస్టు 10 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాముల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇటీవల జరిగిన బోర్డు పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించారు.

కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు బోర్డు గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపింది. కమ్యూనిటీ రేడియో లైసెన్స్ కోసం దరఖాస్తును సిద్ధం చేయడానికి, ప్రాసెస్ చేయడానికి వాటాదారులు, నిపుణులతో వచ్చే ఆరు నెలల్లో సంప్రదింపుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్థికపరమైన చిక్కులను కూడా పరిష్కరించాలని బోర్డు నిర్ణయించినట్లు ఆ అధికారి తెలిపారు.

సీబీఎస్ఈ ఇప్పటికే శిక్షా వాణి అనే పాడ్‌కాస్ట్ నిర్వహిస్తోంది. ఇద...