భారతదేశం, జనవరి 1 -- తెలుగులో విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న హీరో, నటుడు నవీన్ చంద్ర. హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తూనే మరోవైపు నటుడిగా మెప్పించే పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. అలాంటి నవీన్ చంద్ర నటించిన మరో లేటెస్ట్ మూవీనే హనీ.

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హనీ సినిమాకు కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించారు. హనీ మూవీని తెలుగు సైకలాజికల్ హారర్ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఓవీఏ (OVA) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి హనీ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.

హనీ సినిమాను నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణతో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తీర్చి దిద్దారు. ఫిబ్రవరి 6న ఈ హనీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

హనీ ...