భారతదేశం, ఏప్రిల్ 22 -- హైదరాబాద్ పౌరులు ఇకపై నీటి దుర్వినియోగాన్ని నివేదించవచ్చు. జరిమానాలను నేరుగా బిల్లులకు కలిసి వస్తాయి. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి సేవ్ వాటర్ వాలంటీర్ కార్యక్రమం చేపట్టింది. నీటి వృథాను తగ్గించేందుకు.. బాధ్యతాయుత నీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు "సేవ్ వాటర్ వాలంటీర్" కార్యక్రమాన్ని ప్రారంభించింది.

సమర్పించిన దరఖాస్తులను HMWSSB పరిశీలించి, అర్హులైన వాలంటీర్లను ఎంపిక చేసి కార్యక్రమంలో చేర్చుతుంది. ధృవీకరించిన వాలంటీర్లకు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తారు. నీటి వృథా సంఘటనలను ఫోటో ఆధారాలతో అప్లోడ్ చేయవచ్చు. ఫిర్యాదులు ఓటీపీ ద్వారా ధృవీకరిస్తారు ధృవీకరించిన ఫిర్యాదులపై జలమండలి అధికారులు సమీక్ష చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు.

ధృవీకరించిన ఫిర్యాదులు సంబంధిత వినియోగదారుడి CAN కు అనుసంధానం చేసి లెడ్జర్‌లో నమోదు...