భారతదేశం, సెప్టెంబర్ 5 -- జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా మేధస్సుకు ప్రతీక అయిన బుధుడు, ఆత్మకారకుడైన సూర్యుడు కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న బుధుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నారు. త్వరలోనే సూర్య భగవానుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే ఈ అరుదైన యోగం కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ యోగం ఎవరికి ఎలా ఫలితాలను ఇస్తుంది? ఏయే సందర్భాల్లో ఈ రాజయోగం తన పూర్తి ప్రభావాన్ని చూపలేదో వివరంగా తెలుసుకుందాం.

సూర్యుడు, బుధులు ఒకే రాశిలో కలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ ఈ రాజయోగం ఫలితం దక్కుతుందని చెప్పలేం. జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ యోగం పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడానికి కొన్ని కఠినమ...