భారతదేశం, సెప్టెంబర్ 24 -- జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుని సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్వరలో మేష రాశిలోకి ప్రవేశించనున్న చంద్రుడి ప్రభావం వల్ల అన్ని రాశులపై ప్రభావం పడనున్నప్పటికీ, ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉండనుంది.

ఖగోళ మరియు జ్యోతిష్య గణనల ప్రకారం, సెప్టెంబర్ 28, 2026 న చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశించి సుమారు రెండు రోజుల పాటు అక్కడే సంచరిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 30న వృషభ రాశిలోకి మారుతారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు, ప్రశాంతతకు మరియు భావోద్వేగాలకుకారకుడిగా పేర్కొంటారు. అగ్ని తత్వ రాశి అయిన మేషానికి కుజుడు అధిపతి. ఉత్సాహం, శక్తి నిండిన ఈ రాశిలో మనఃకారకుడు సంచరించడం వల్ల మనుషులలో ఒక్కసారిగా శక్తి ఇనుమడిస్తుంది. నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది.

చంద్రుని ఈ సంచారం కారణంగా మేషం మొదల...