Andhrapradesh,tirumala, ఆగస్టు 19 -- తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలారావు. అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుుకన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2వ తేదీన చక్రస్నానం ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఈవో నిర్ణయించారు. ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలన్నా...