Hyderabad, సెప్టెంబర్ 12 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో దసరా ఒకటి. ప్రతి ఏటా దసరా పండుగను తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పెట్టి పూజిస్తారు. ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలవుతాయి.

తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. అయితే, దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది? ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం.

నవరాత్రి మొదటి రోజున శ్రీ చండీ దేవి రూపంలో అమ్మవారిని అలంకరించి నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. ఆ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. తెలుపు శాంతి, స్వచ్ఛతకు ప్రత్యేకమైనది. ఈ రంగు దుస్తులను ధరించడం వలన మనసుకు ప్రశాంతత ఉంటుంది.

నవరాత్రి రెండవ ర...