భారతదేశం, సెప్టెంబర్ 15 -- మనస్సుకికారకుడైన చంద్రుడు సెప్టెంబర్ 17 నుంచి రెండ్రోజుల పాటు తన నీచ రాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించబోతున్నాడు. కుజుడి ఆధిపత్యం ఉండే ఈ జల తత్వ రాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మానసిక స్పందనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ గోచార కాలం పరిశోధనలకు, రహస్య విషయాలను వెలికితీయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఈ సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ, ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఇది అత్యంత లాభదాయకంగా మారుతుందని స్పష్టమవుతోంది.

వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ చంద్ర గోచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్టం తోడు నిలవడంతో పాటు మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు సొంతం చేసుకుంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ ఇంటికి చేరతాయి. ఆర్థికంగా బలపడే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి.

సిం...