Andhrapradesh, ఆగస్టు 5 -- మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని... కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు.

ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చు అని సీఎం అన్నారు. మద్యం పాలసీ అంటే ఆదాయం మాత్రమే అని భావించొద్దని...ప్రజల ఆరోగ్యాలు ప్రధానమైన అంశమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

సోమవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆబ్కారీ శాఖపై రివ్యూ చేశారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్...