భారతదేశం, మే 22 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో సెడాన్ కార్లకు కేరాఫ్ అడ్రస్ అంటే అది 'హోండా సిటీ'. 1998లో భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నేటి వరకు ఈ కారు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా హోండా సంస్థ ఐదో జనరేషన్ సిటీకి రెండోసారి మెరుగులు దిద్ది 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇన్ని కొత్త ఫీచర్లు జోడించినా ప్రారంభ ధరను పాత మోడల్ ధరకే (రూ. 11.99 లక్షలు) ఉంచడం విశేషం. హైబ్రిడ్ మోడల్ (e:HEV) ధరను రూ. 20.99 లక్షలుగా నిర్ణయించారు.

త్వరలో రాబోతున్న హోండా ZR-V కంపెనీకి కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ అయినప్పటికీ, హోండా బ్రాండ్ విలువను కాపాడే గుండెకాయ మాత్రం 'సిటీ' అనే చెప్పాలి.

2026 హోండా సిటీ బాహ్య రూపంలో ప్రధాన మార్పులు చేశారు. కారు ముందు భాగంలో ఒక చివర నుంచి మరో చివర వరకు సాగే 'కనెక్టెడ్ లైట్‌బార్' ఇప్పుడు దీనిక...