భారతదేశం, జూలై 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చిందంటే 12 రాశులపై కూడా ప్రభావం పడుతుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కనబడితే, మరోసారి అశుభ ఫలితాలు ఎదురవుతాయి.

సూర్యుడు నాయకత్వ లక్షణాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదలైన వాటికి కారకుడు. సూర్య సంచారంలో మార్పు వస్తే 12 రాశుల వారిపై కూడా ప్రభావం పడుతుంది. జూలై 16, అంటే ఈరోజు, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశికి చంద్రుడు అధిపతి. సూర్యుడు చంద్రుడి రాశిలోకి వెళ్లడంతో కొన్ని రాశుల వారు అనుకోని విధంగా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో, ఆ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

కర్కాటక రాశి వారికి సూర్యుడి సంచారం శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఈ సమయంలో పరిష్కరిస్తారు. ఈ ...