భారతదేశం, జూలై 11 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. మరికొన్ని రోజుల్లో సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జూలై 24 ఉదయం 11:30 గంటలకు సూర్యుడు పుష్య నక్షత్రంలోకి అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? సూర్యుడు నక్షత్ర సంచారంతో ఏ రాశి వారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి.. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి

మేష రాశి వారికి సూర్య సంచారం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో బాగుంటుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా సక్రమంగా ప...