భారతదేశం, ఆగస్టు 6 -- ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం రోజే కుజుడు ఆర్దుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. రాహువు ఆధిపత్యం ఉన్న ఈ నక్షత్ర సంచారం వల్ల కన్య, మీన, తులా రాశుల వారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఏర్పడే పవిత్రమైన రోజే గ్రహాల సేనాపతి అయిన కుజుడు తన నక్షత్రాన్ని మారుస్తున్నాడు. ఆగస్టు 12, 2026 న కుజుడు రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. సెప్టెంబర్ 2 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తి, భూమికికారకుడిగా భావిస్తారు. అలాగే రాహువును ఆకస్మిక పరిణామాలు, భ్రమలకు కారకుడిగా చెబుతారు.

గ్రహాల సేనాపతి రాహువు నక్షత్రంలోకి ప్రవేశించడం చాలా కీలకమైన పరిణామం అని ప్రముఖ జ్యోతిష్యులు నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించారు. సూర్య గ్రహణం...