భారతదేశం, ఫిబ్రవరి 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. గ్రహాల స్థితిలో మార్పు వస్తే అది అందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలుగుతాయి, మరి కొన్నిసార్లు అశుభ ఫలితాలు వస్తాయి. సూర్యుడు, చంద్రుడి సంయోగం త్వరలో ఏర్పడబోతోంది. హోలీ పండుగ తర్వాత ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూర్య, చంద్రుల సంయోగం వలన ఏర్పడే ఈ యోగం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను కలిగిస్తుంది, ఎవరు సమస్యలను ఎదుర్కోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రమాదకరమైన యోగంగా వ్యతిపాత యోగాన్ని భావిస్తారు. ఈ యోగం ఏర్పడినప్పుడు చంద్రుడు, సూర్యుడు మధ్య 180 డిగ్రీల దూరం ఉంటుంది. ఒకదానికొకటి ప్రత్యక్షంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగించే అవకాశం ఉంది. సూర...