భారతదేశం, సెప్టెంబర్ 10 -- సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పుకొచ్చారు. ఈ సభ రాజకీయాలు, ఓట్ల కోసం కాదని చెప్పారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నెలబెట్టుకున్నామని చెప్పే సభ అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం.

ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2024 ఎన్నికల్లో 95 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారని చెప్పారు. తెలుగు తమ్ముళ్ల స్పీడ్.. జనసేన జోరు.. కమలదళం ఉత్సహానికి ఎదురుందా అని అడిగారు.

స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 5 కోట్ల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని చంద్రబాబు చెప్పారు. ఉచిత బస్సు పథకం ...