భారతదేశం, సెప్టెంబర్ 10 -- కూటమి ప్రభుత్వ తీరు.. అట్టర్ ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టినట్టుగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. సూపర్ సిక్స్ ఫ్లాప్ అయినా.. సూపర్ హిట్ అని సభలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు. రైతు సమస్యలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల్లో అక్రమాలు వంటి అంశాలపై మండిపడ్డారు.

రైతులకు యూరియా సరఫరాలో కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు జనగ్. మంగళవారం వైసీపీ నిర్వహించిన అన్నదాత పోరు నిరసనల్లో పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ, పోలీసులు వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతులు తమ ఉత్పత్తులకు తగిన మద్దతు ధరలు అందడం లేదని వాపోతు...