Andhrapradesh, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అనేక ఎత్తుపల్లాలను చూసిందని చెప్పారు.

"2014లో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారీ కొత్త సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగింది. 2024 ఎన్నికల్లో 'ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి' అనే NDA నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశబ్ద విప్లవాన్ని సృష్టించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్‌కు బాటలు వేసేలా తొలి రోజు ను...