భారతదేశం, నవంబర్ 9 -- టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించిన జటాధర సినిమాకు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఇద్దరు దర్శకత్వం వహించారు.

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన జటాధర సినిమాకు రెస్పాన్స్ బాగానే ఉంది. అయితే, ఊహించినంత స్థాయిలో మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో జటాధర మూవీ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. జటాధర సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంటూ మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.

జటాధర సినిమాకు వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో రూ. 2.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. తొలి రోజు జటాధర సినిమాకు రూ. 1.47 కోట్లు వచ్చినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అలాగే, రెండో రోజున ఈ ...