భారతదేశం, సెప్టెంబర్ 26 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కొత్త ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో (ఆన్-స్క్రీన్ మార్కింగ్ - OSM) అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వివాదం తలెత్తిన నాటి నుంచి, గత నాలుగు నెలల వ్యవధిలోనే సీబీఎస్‌ఈకి మూడో ఛైర్మన్‌ను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహించిన లోఖండే ప్రశాంత్ సీతారామ్ స్థానంలో భండారీ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.

కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) పరిధిలోని క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) సెప్టెంబర్ 25న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఎస్‌ఈ ఛైర్మన్ పోస్టును తాత్కాలికంగా అదనపు కార్యదర్శి హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ, ఏజ...