భారతదేశం, సెప్టెంబర్ 22 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల శాంపిల్ ప్రశ్నపత్రాలను (SQP), మార్కింగ్ స్కీమ్‌లను (MS) అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, బోధకులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా వీటిని పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రశ్నాపత్రం రూపకల్పన, విశ్లేషణ విధానంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకే వీటిని విడుదల చేసినట్లు సీబీఎస్ఈ తెలిపింది. తరగతి గది బోధనలో సైతం ఈ శాంపిల్ పేపర్లను ఉపయోగించుకోవాలని సూచించింది. పుస్తకాల్లోని సిద్ధాంతపరమైన అంశాలను నిజ జీవితంలో ఎలా అన్వయించాలో (Real-life application of concepts) నేర్పించడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు వెల్లడించింది.

అకడమిక్ సెషన్ 2026-27కు సంబంధించి ప్రశ్నాపత్రం నమూనాలోగానీ, మూల్యాంకన వి...