భారతదేశం, నవంబర్ 14 -- మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నోటిఫికేషన్ రాకముందే పార్టీలు జూబ్లీహిల్స్‌లో మకాం వేశాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నడుమ పోటీ మామూలుగా లేదు. ప్రతీ ఓటరును దర్శనం చేసుకున్నాయి పార్టీలు. ఎలాగైనా గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావులాంటి కీలక నేతలు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్‌లో ఈ ఎన్నికలకు స్ట్రాటజీ ప్లే చేశారు. అది సక్సెస్ అయింది. ఫలితంగా 24,729 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ గెలిచారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల వేల సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ ప్లే చేశారు. ఈ స్థానంలో ముస్లిం ఓటర్లు అధికం. వారు ఎటువైపు ఓటు వేస్తారో ఆ ప...