భారతదేశం, డిసెంబర్ 18 -- దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గానూ... 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది.

మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది.

ఈసారి జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్య...