భారతదేశం, సెప్టెంబర్ 23 -- కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు, హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200 CSR-338 స్నైపర్ రైఫిల్స్ ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి సరఫరా పూర్తి కానుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్‌, ఐకామ్-కారకాల్ మధ్య ఒప్పందం కుదిరింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్‌‌తో ఐకామ్ సంస్థ సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యంతో భాగంగా, కారకాల్‌తో కలిసి ఐకామ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఆధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్కడే ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేసి సీఆర్...